17 March, 2026 | 12:09 AM

చెరువులకు పూర్వ వైభవం తీసుకువస్తాం

16-03-2026 12:15 AM

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు 

మంచిర్యాల, మార్చి 15 (విజయక్రాంతి): చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా చెరువుల పునరుజ్జీవ పనులు చేపట్టడం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామునిచెరువు, నస్పూర్ మండల కేంద్రంలోని చెరువుల పునరుజ్జీవ పనులకు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్యలతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం క్రింద మంచి ర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువు, నస్పూర్ మండల కేంద్రంలోని చెరువు పునరుజ్జీవ పనులు చేపట్టడం జరిగిందన్నారు. చెరువులలో నీళ్లు నిండేలా చెరువులకు పూర్వ వైభవం కల్పించేలా ప్రభు త్వం పునరుజ్జీవ చర్యలు చేపడుతుందన్నారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అనేక చర్యలు చేపడుతున్నా మని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగం గా పారిశుద్ధ్యం, త్రాగునీరు, కనీస మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న పైళ్లను పరిష్క రించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నా రు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధికి పనిచేస్తా...

లక్షెట్టిపేట: లక్షెట్టిపేట మున్సిపల్ అభివృద్ధికి తాను ముందుండి పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. ఆదివారం ప్రజా ఆరోగ్య, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అమృ త్ 2.0 పథకం క్రింద మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు  పునరుద్ధరణ కార్యక్ర మానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయ న మాట్లాడారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మి కౌన్సిలర్లను గెలిపించారని, గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్,  తహసిల్దార్ దిలీప్ కుమార్,  ప్రభు త్వ ప్రజారోగ్య శాఖ డిఈ మధుకర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మం డల అధ్యక్షుడు పింగళి రమేష్, 1వ వార్డు, మూడో వార్డు,  పదోవార్డు, 15వ వార్డు  కౌన్సిలర్లు సిద్ధార్థ, పెట్టెం తిరుపతి,  పెండెం రాజు,  గోపి సుజాత, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.