29 June, 2026 | 12:38 PM

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో కీలక నియామకాలు

29-06-2026 11:29 AM

జిల్లా ఉపాధ్యక్షులుగా ఎల్లే రామ్మూర్తి

జిల్లా కార్యదర్శిగా రొడ్డ బాపన్న

పెద్దపల్లి, జూన్ 29(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో కీలక నియామకాలు చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతనంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ఎల్లే రామ్మూర్తిని, జిల్లా కార్యదర్శిగా రొడ్డ బాపన్నను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

నాయకత్వానికి కృతజ్ఞతలు

నూతన బాధ్యతలు స్వీకరించిన ఎల్లే రామ్మూర్తి, రొడ్డ బాపన్న తమపై విశ్వాసం ఉంచి కీలక పదవులను కట్టబెట్టిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం:మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

ఈ సందర్భంగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ నూతనంగా నియమితులైన నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, "పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన నాయకులు అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలి" అని ఆకాంక్షించారు.

అందుబాటులో ఉంటూ సేవ చేస్తాం

తమపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతనంగా నియమితులైన నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, లద్నాపూర్ సర్పంచ్ వనం రామచంద్రరావు, మాజీ సర్పంచ్‌లు తీగల సమ్మయ్య, ఎరుకల బాపూరావు, ఐఎన్‌టీయూసీ నాయకులు బెల్లం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు తీగల సదయ్య, ధర్మల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు కనుకయ్య, భద్రయ్య, వేగోలపు మోహన్ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.