17 March, 2026 | 1:25 AM

అభివృద్ధే ప్రధాన లక్ష్యం

16-03-2026 12:16 AM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చండూరు, మార్చి 15: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి వెనుకడుగు ఉండదని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామంలో ఒక కోటి 43 లక్షల వ్యయంతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని అదేవిధంగా  బోడంగి పర్తి, నేర్మట, గ్రామాలలోప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనాలకు, తిమ్మారెడ్డి గూడెంలో రోడ్డునిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి తాము రెండు సంవత్సరాలలోనే వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటి తక్షణమే పరిష్కరిస్తున్నా మన్నారు. కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి వేగంగా జరగాలంటే స్థానిక ప్రజల సహకారం కూడా అవసరమని ప్రజలు సహకరిస్తే మరింత వేగవంతంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండల పరిధిలోని గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొరిమి ఓంకారం, చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చండూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ కోడి వెంకన్న, మండల వైద్యాధికారి డాక్టర్ రాజు, డాక్టర్ కల్యాణ చక్రవర్తి, మాజీ జెడ్పిటిసి మాధగోని విజయలక్ష్మి, తుమ్మలపల్లి సర్పంచ్ బోయపల్లి రాజు, నేర్మట సర్పంచ్ నారాపాక వసంత ధనయ్య, ఆయా శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.