29 June, 2026 | 12:38 PM

రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు

29-06-2026 11:30 AM
  1. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు
  2. పరిపాలన రేవంత్ కు వ్యాపారం
  3. రేవంత్ సంపాదన రూ.50 వేల కోట్లు దాటింది
  4. రేవంత్ రెడ్డిని మించిన దోపిడి దారులు లేడు
  5. నల్గొండ సీఎం సభలో కుర్చీలన్నీ ఖాళీ
  6. హ్యామ్ రోడ్లలో అన్నీ స్కామ్ లే

హైదరాబాద్: నల్గొండ ముఖ్యమంత్రి సభలో అన్ని ఖాళీ కుర్చీలేనని  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Former Minister Jagadish Reddy) ఎద్దేవా చేశారు. హ్యామ్ రోడ్లలో అన్నీ స్కాములే అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రేపు రైతు భరోసా ఇస్తాం అంటున్నారు. యాసంగి రైతుభరోసా ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని మించిన దోపిడీదారుడు లేడని ఆరోపించారు.

పరిపాలన రేవంత్ కు వ్యాపారం అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంపాదన రూ. 50 వేల కోట్లు దాటిందంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అవసరం లేదన్న జగదీశ్ రెడ్డి అసెంబ్లీ పెట్టు ఎన్ని గంటలైనా మాట్లాడుకుందామన్నారు. సీఎం చెప్పినట్టు స్పీకర్ సభ నడుపుతారు. సంస్కారహీనంగా మాట్లాడే వ్యక్తి రేవంత్ అన్నారు.