29 June, 2026 | 12:04 PM

కల్లూరు పట్టణంలో డీసీసీబీ బ్యాంకును ప్రారంభించిన మంత్రి తుమ్మల

29-06-2026 10:42 AM

కల్లూరు పట్టణంలో నూతన డీసీసీబీ బ్యాంకు

కల్లూరు,(విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణములో నూతన గా ఏర్పాటుచేసిన డీసీసీబీ నూతన బ్రాంచ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ తో పాటు సహకార సంఘ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.