16 March, 2026 | 10:55 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

దేశానికే గర్వకారణం ఆదివాసీ సంస్కృతి

16-03-2026 12:13 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, మార్చి ౧౫ (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండీ ధర్మ గురు వు హీరాసుక్కా జయంతి సందర్భంగా ఆదివా రం జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆదివాసీ సాంప్రదాయ వాయిధ్యాలతో హిరాసుక్కా చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆదివాసి సాంప్రదాయా నృత్యoలో చేస్తూ ఆకట్టుకున్నా రు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు. హీరాసు క్కా జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేసిందన్నారు. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసీల జీవన విధానం ఎంతో గొప్పదని చెప్పారు. జల్, జంగల్, జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలని సూచిస్తూ, ప్రస్తుతం ఆదివాసీ విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం శుభపరిణామమన్నారు. రిటైర్డ్ డీఎస్పీలు, ఎంఆర్‌ఓలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పర్ధన్ సమాజ్ నాయకులు దుర్వా నగేశ్, సిడాం రాంకిషన్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.