27 June, 2026 | 1:54 AM

మాదిగలను అడ్డుకుంటే సహించం

27-06-2026 12:35 AM

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

బెజ్జంకి, జూన్ 26: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటనను డీఎస్పీ పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి అడ్వకేట్ లింగాల సురేష్ తీవ్రంగా ఖండించారు.శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుల వివక్షకు రాష్ట్రంలో ఎలాంటి స్థానం లేదని అన్నారు.

మాదిగలను అవమానించడం, ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని కోరారు.