27 June, 2026 | 1:53 AM

పిడుగుపాటుకు యువకుడు మృతి

27-06-2026 12:34 AM

సదాశివపేట, జూన్ 26 : సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఉన్న సమయంలో పిడుగు పడటంతో గ్రామానికి చెందిన చింతకుంట అనిల్ ముదిరాజ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో అనిల్తో పాటు పక్కనే ఉన్న మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో  వెంకటాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.