30 August, 2026 | 2:12 AM

రోడ్డు ప్రమాదాల రహితంగా తీర్చిదిద్దుతాం

30-08-2026 12:00 AM

జవహర్‌నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్

జవహర్‌నగర్, ఆగస్టు 29 (విజయక్రాంతి): జవహర్‌నగర్ వాటి చుట్టుపక్కల ప్రాంతాలను రోడ్డు ప్రమాదాల రహితంగా తీర్చి దిద్దుతామని బారికేడ్ల ఏర్పాటుతో వాహనాల వేగ నియంత్రణ అదుపులోకి రావడానికి తోడ్పడుతుందని జవహర్ నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ అన్నారు. యాప్రాల్ శైలి గార్డెన్ సమీపంలో ప్రమాదాలను నివారించాలని కాలనీవాసులు ట్రాఫిక్ సిఐ శివశంకర్ కు విన్నవించడంతో వెంటనే స్పందించి శనివారం బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని తాగి వాహనాలను నడప రాదని ప్రజల్లో ట్రాఫిక్ పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చునని రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలన్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రద్దీ ఎక్కువగా అవుతున్నందువలన ప్రజలు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తూ తమ వాహనాలను నడపాలన్నారు. అనంతరం బారిఖేడ్లను కాలనీవాసులతో కలిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగేష్ వంగ, దినేష్ రాజ్, క్రిస్టోఫర్ రాస్ ఆరిస్తాన్, నర్సింగ్ రావు, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.