3 September, 2026 | 4:18 AM

పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం

03-09-2026 | 12:35am

టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, సెప్టెంబర్ 2(విజయక్రాం తి): తెలంగాణలో బీసీల సంపద, అవకాశాలు, ప్రభుత్వ నిధుల దోపిడీకి వ్యతిరేకంగా రాజ్యాధికార పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikari Party) వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం(Farmer welfare), సాగునీటి ప్రాజెక్టుల(irrigation projects) పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వాటి ప్రయోజనాలు ప్రధానంగా అగ్రవర్ణాలకే చేరుతున్నాయని మల్లన్న మండిపడ్డారు.

ఇందిరా పార్క్ వద్ద రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని జరుగుతున్న ఆందోళనలపై స్పందిం చిన మల్లన్న, ఎప్పుడూ అధికార, ఆర్థిక అవకాశాలను అనుభవించిన వర్గాలు నేడు రోడ్డెక్కి ధర్నాలు చేయడం బీసీ చైతన్యానికి నిదర్శనమన్నారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌గర్ నియోజకవర్గం నుంచి బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్ ఆధ్వర్యం లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. కాగా  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మిత్రుడు మాదాపుర్‌కు చెందిన చంద్రశేఖర్‌ను తీన్మార్ మల్లన్న పరామర్శించారు.