9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

ఆర్‌అండ్‌బీ అధికారుల ఆచూకీ చెబితే సన్మానం చేస్తాం

20-11-2025 01:06 AM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ వ్యంగాస్త్రం 

కాటారం, నవంబర్ 19 (విజయక్రాంతి) :జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్లు , భవనాల శాఖ అధికారులు కనిపించడం లేదని, ఆచూకీ తెలిపిన వారికి ఘనంగా సన్మానం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ వ్యం గస్త్రం విసిరారు.భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహాదేవపూర్ 353 సి జాతీయ రహదారి పరిధి లో ఉన్న రోడ్లు సైతం రైలు పట్టాల మాదిరిగా గాడీలు ఏర్పడి అనేక ప్రమాదాలతో పాటు పలువురు మృత్యువాత పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా శ్రీకాంత్ గుర్తు చేశా రు.

అలాగే మలహర్, పలిమెల, మహా ము త్తారం, కాటారం, మహదేవ పూర్ మండలాల అంతర్గత రహదారులు పూర్తిగా అద్వా నంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల సమయం దగ్గర ప డుతున్న వేళలో రాజకీయ విభేదాలు విస్మరించి పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి రాజకీయ పార్టీలు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా మొగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల తదితర మండలా లలో కూడా రోడ్లు చిన్నాభిన్నమై వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందిగా ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక దఫాలు గా ఆర్ అండ్ బి అధికారుల కార్యాలయాల కు వెళ్లినప్పటికీ సంబంధిత శాఖలో సదరు అధికారుల జాడ కానరావడం లేదని శ్రీకాం త్ తీవ్రస్థాయిలో ద్వజ మెత్తారు. రోడ్ల అ ద్వాన పరిస్థితులపై అనేకసార్లు పత్రికలు, మీ డియాలలో అనేక కథనాలు వెలువడినప్పటికీ సంబంధిత శాఖ అధికారులలో ఎలాం టి చలనం లేకపోవడం శోచనీయమని శ్రీ కాంత్ పేర్కొన్నారు.

రోడ్లను బాగు చేయడానికి అధికారులు ఎందుకు తాశ్చర్యం చేస్తు న్నారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవస రం ఉందని అన్నారు. ప్రభుత్వం నిధులను వెచ్చించి ప్రజల కోసం ఏర్పాటుచేసిన రోడ్ల నిర్మాణాలు, మరమ్మతు పనులను పూర్తి చే యకుండానే సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు మామూళ్లకు ఆశపడి, కాంట్రాక్టర్ల తో కుమ్మక్కైనట్టుగా శ్రీకాంత్ ఆరోపించారు.

నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పై చర్యలు చేపట్టకుండా, అధికారులు పర్యవేక్ష ణ చేయకుండా బాధ్యతను విస్మరించడం ఆ ర్ అండ్ బి అధికారులకు తగదని, అధికారు ల్లో మార్పు రాకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని శ్రీకాంత్ హెచ్చరిం చారు. ఆర్ అండ్ బి అధికారులను ఆఫీసులకు పట్టుకొని తీసుకొచ్చిన వారికి సన్మానం చేస్తామని శ్రీకాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారుతెలిపారు.