28 July, 2026 | 2:59 PM

జైనూర్ కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుడికి సుగుణక్క ఘన సన్మానం

28-07-2026 02:03 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన షేక్ రషీద్‌ను జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపిన సుగుణక్క, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అలాగే మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.షేక్ రషీద్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జైనూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.