28 July, 2026 | 1:46 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది

28-07-2026 01:02 PM

- తెలంగాణలో మార్పు కోసం బీజేపీ పార్టీకి అవకాశం కల్పించే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు.

- బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు

హుజూర్ నగర్: తెలంగాణలో మార్పు కోసం బీజేపీ పార్టీకి అవకాశం కల్పించే దిశగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రానున్నదని బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు తెలిపారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలో గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సీనియర్ జనసంఘ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులు, దేశం కోసం పని చేయాలనుకునే వారు బీజేపీ పార్టీలోకి చేరుతున్నారని, సైద్ధాంతిక ప్రమాణాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు. బీజేపీ అంటేనే తెలవని రోజుల నుండి నేటి వరకు బీజేపీ బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు.

త్రిపుర,హర్యానా,ఒడిశా రాష్ట్రాలతో సహా బీజేపీ పార్టీ విజయం సాధించింది అదే పంథాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ బలపడుతుందన్నారు. సమాజంలో  దేశంలో ప్రజలకు మార్పు రావలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతు న్నాయన్నారు.దేశాన్ని ఎందరో విదేశీయులు వందల సంవత్సరాలు పరిపాలించి నప్పటికీ హైందవ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మార్చలేక పోయారని, క్రిస్టియన్ దేశాలుగా ముస్లిం దేశాలుగా మారిన కొన్ని దేశాల్ల మన భారత దేశాన్ని మార్చే కుట్రలు ఇటీవల జరుగుతు న్నాయన్నారు. విదేశీ శక్తులు రాజకీయ అస్థిరత కోసం ఫండింగ్ కూడా పంపిస్తున్నారని తెలిపారు.భారతీయులను విడగొట్టలేరనే సంకేతాన్ని సంఘ విద్రోహ శక్తులకు సంకేతాలు అందేలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.

సర్ కార్యక్రమం గురించి కొన్ని పార్టీలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు అందిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం పార్టీ రోహ్యింగాలకు హక్కుకు కల్పించే ప్రయత్నాలు చేస్తుందని ఈ విషయాన్ని సహించేదిలేదని తెలిపారు. ఇలాంటి వారు భారతదేశంలో శాంతి భద్రతలకు ప్రమాదమని విమర్శించారు. దేశసేవ కోసం ముందుకు వచ్చే వారిని కార్యకర్తలు గుర్తించి జాతీయ భావాన్ని పెంపొందించి కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకువచ్చే ఆలోచన చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి,సీనియర్ జనసంఘ,ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పాల్గొన్నారు.