3 June, 2026 | 2:36 AM

అమరుల ఆశయాలను సాధిస్తాం

03-06-2026 01:56 AM
  1. అదే వారికి నిజమైన నివాళి 
  2. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
  3. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ
  4. రంగారెడ్డి కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు

రంగారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇ న్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొం గరకలాన్‌లోని కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అమరవీరుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, ఘనంగా సన్మానించా రు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు.

రాష్ట్ర సాధన కో సం ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయాలను సాధించడమే వారికి ఇచ్చే నిజమై న నివాళి అని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో వి విధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. 

57.38 కోట్ల చెక్కుల పంపిణీ

రంగారెడ్డి జిల్లాలోని 672 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.57.38 కోట్ల విలువైన ఆర్థిక సహాయ చెక్కును మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధి పథకం (పీఎంఫమ్) కింద యా చారం మండలంలోని రెండు యూనిట్లకు రూ.4.27 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పాఠశాల వి ద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.  ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మంత్రి మెమెంటోలు అందజేశారు.

అనంతరం, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవల వి వరాలను అడిగి తెలుసుకున్నారు. వేడుకల్లో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ల చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే లు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్ సి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, డీఆర్‌ఓ శారద పాల్గొన్నారు.