23 April, 2026 | 7:55 AM

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సూరయ్యపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

23-04-2026 01:31 AM

మంథని, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మంథని మండలం సూరయ్య పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేరీ మీడియా స్కూల్ ఎదురుగా నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజ్ కు బుధవారం గ్రామ సర్పంచ్ ఆర్ల నాగరాజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో డిఎంఎఫ్టీ నిధుల నుండి రూ. 10 లక్షలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, గ్రామ ప్రజలకు తెలిపారు.

సురయ్యపల్లి గ్రామం అంటే అభివృద్ధికి చిరునామాగా తీర్చి దిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారని,  అభివృద్ధి లక్ష్యంగా గ్రామ సర్పంచులు ఉండాలని శ్రీధర్ బాబు  పిలుపునివ్వడం ఎంతో సంతోషకరమని అన్నారు. శ్రీను బాబు గ్రామం పై ప్రత్యేక దృష్టిని సారించారని  అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల కిరణ్, వార్డు సభ్యులు జంజర్ల అమరేందర్, రావుల బానమ్మ నగేష్, ఆర్ల క్రాంతి, ఆకుల సందీప్, సుంకరి శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంజర్ల రాజు, ఆర్ల లింగయ్య, జంజర్ల మల్లేష్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్ర విజయ్, ఎరుకల సురేష్ , తదితరులు పాల్గొన్నారు.