మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు
06-07-2026 07:38 PM
* ముస్కాన్ 12 సబ్ డివిజన్ ఇంచార్జ్ ఎస్ఐ ఇందిర
అచ్చంపేట,(విజయక్రాంతి): మైనర్ బాల బాలికలను పనిలో పెట్టుకుంటే సదరు యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ముస్కాన్ 12 అచ్చంపేట సబ్ డివిజన్ ఇంచార్జ్ ఎస్ ఐ ఇందిర హెచ్చరించారు. సోమవారం అచ్చంపేట మండల పరిధిలోని హాజీపూర్ పరిసర ప్రాంతాలలో ఇటుక తయారీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు మైనర్ బాలురు పనిలో ఉండగా వారిని గుర్తించి సిడబ్ల్యుసి కమిటీ ముందు హాజరు పరచడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై ఇందిర మాట్లాడుతూ మైనర్ బాల బాలికలను పనిలో పెట్టుకోవడం చట్ట ప్రకారం నేరమని అన్నారు. పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.






