కరీంనగర్ లో హైకోర్టు ఆదేశాల బేఖాతరు
సీజ్ చేసిన భవనంలో యథేచ్ఛగా కార్యకలాపాలు
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో హైకోర్టు ఆదేశాలకు తూట్లు పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 2019 మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించిన ఒక బహుళ అంతస్తుల భవనం విషయంలో అధికారులు తీసుకున్న చర్యలను తప్పుపడుతూ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు డబ్ల్యూ పి నంబర్ . 35394 ఆఫ్ 2025 తేదీ: 20-11-2025 ప్రకారం, కళ్ళెపెల్లి బలరాజ్ అనే వ్యక్తి నిర్మించిన అక్రమ భవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని
హైకోర్టు ఆదేశిస్తే, హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు సదరు భవనాన్ని సీజ్ చేశారని తెలిపారు. అయితే, సీజ్ చేసిన రెండు మూడు రోజుల్లోలోపే కళ్లపల్లి బాలరాజ్ ఆ సీల్ తొలగించి, భవనంలోకి ప్రవేశించి నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు.కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికారులు సీజ్ చేసిన ఇంటిని అధికార పార్టీ అండదండలతో, ఓమంత్రి ప్రమేయంతో తొలగించి, అక్రమంగా నివాసముంటున్నారని, ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.






