2 March, 2026 | 3:45 AM

అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

02-03-2026 02:07 AM

సుల్తానాబాద్ మార్చి 1 (విజయ క్రాంతి): పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారం తో సుల్తానాబాద్ ము న్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి ని రంతరం కృషి చేస్తానని సుల్తానాబాద్ ము న్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, ఆదివారం మున్సిపల్ పరిధిలోని 4వ వార్డ్ , 15వ వార్డ్ లో బొమ్మ వెంకటలక్ష్మి , తాటిపాముల తిరుమల, ఎలగందుల విజయ ల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు,

ఈ సందర్భంగా చైర్మన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే తో పాటు పాలకవర్గం , అధికారులు, ప్రజల అందరి సహకారం తో అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు వెళ్తానని అన్నారు , ఈ కార్యక్రమంలో ఆయన వెంట 15 వ వార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల, రవీందర్ , చిలగాని రాజు, సంతోష్, నవీన్, రాజేందర్, మంతేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.