09-02-2026 12:03:03 AM
ఎంపి మల్లు రవి
అయిజ ఫిబ్రవరి 8 అయిజ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రోడ్డు షో నిర్వంచారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ గత పది ఏళ్ల కాలం నుంచి ఐజ అభివృద్ధి కుంటుపడిందని రోడ్ షో నిర్వహించిన సందర్భంగా గ్రహించింది ఏమిటంటే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని టిఆర్‌ఎస్ పాలనలో దళితుల చైర్మన్ గా ఉండి కూడా దళితవాడను నాశనం చేశారని అన్నారు.
డబ్బులకు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అయిజను అభివృద్ధి చేసుకుందామని అవసరమైతే అయిజను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని అన్నారు. అధికారంలో లేని పార్టీలకు ఓట్లు వేసినట్లయితే మీ ప్రాంత అభివృద్ధిని మీరే దూరం చేసుకున్నట్లు అవుతుందని, ఎందుకంటే నిధులు తెచ్చుకొని అయిజ అభివృద్ధి చేసుకోవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సంపత్ కుమార్ అన్నారు.
ఐజలోనే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్క గుడిసె కూడా కనిపించకుండా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 2,3,4,15,16 వార్డుల అభ్యర్థులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.