calender_icon.png 9 February, 2026 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాయణ,మహాభారత జ్ఞాన పోటీలకు విశేష స్పందన

09-02-2026 12:01:51 AM

  1. యువతలో ధర్మ జ్ఞానం పెంచుతాయి

విశ్వహిందూ పరిషత్ సస్సంగ్ ప్రముఖ్ రాచాల జనార్దన్ 

చిన్నచింతకుంట ఫిబ్రవరి 8 : ధర్మ గ్రంథాల జ్ఞానం పరీక్ష క్విజ్ పోటీల్లో యువతలో ధర్మ జ్ఞానం పెంచుతాయి అని విశ్వహిందూ పరిషత్ సస్సంగ్ ప్రముఖ్ రాచాల జనార్దన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విక్టరీ పబ్లిక్ హై స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విశ్వహిందూ పరిషత్ సస్సంగ్ ప్రముఖ్ రాచాల జనార్దన్ మాట్లాడారు. మండల కేంద్రంలో ని వివిధ పాఠశాలల్లోని 3 నుండి 10 వ తరగతులకు చెందిన 150 మంది విద్యార్థులకు రామాయణం,మహాభారతం పై క్విజ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ధర్మ గ్రంథాల జ్ఞానం పరీక్ష క్విజ్ పోటీల్లో యువతలో ధర్మ జ్ఞానం పెంచుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను , సంస్కృతి, సంప్రదాయాల పైన అవగాగాన పెంపొందించాలని రాముడి యొక్క జీవితం ఈ మానవాళికి ఆదర్శం కాబట్టి విద్యార్థులు కూడా తల్లితండ్రుల మాటకు ఎదురుచెప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం ధర్మంగా ఉండాలన్నారు.

రామాయణం, మహాభారతం ఇతిహాసాలు విద్యార్థులకు ధర్మం, కర్తవ్యాలు, జీవిత పాఠాలు నేర్పుతాయి. రామాయణం ద్వారా రాముడు తల్లిదండ్రుల వాక్యం పాటించి 14 సంవత్సరాల వనవాసం వెళ్లడం విధేయత, సహనం నేర్పుతుందన్నారు. నిర్వాహకులు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి మండల అధ్యక్షులు శివయ్య,బజరంగ్ దళ్ జిల్లా గోరక్ష సంయోజఖ్ అడ్వకేట్ సుదర్శన్ గౌడ్ , పూజారి శ్రీను , బుజ్జన్న , ముని , మధు ,బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.