1 April, 2026 | 2:28 PM

Breaking News

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌   •   లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •  

విశ్వశాంతి కావాలి !

30-03-2026 12:00 AM

యుద్ధ రక్కసి ఉక్కుపాదాల కింద 

ప్రపంచం నలుగుతున్నది

మానవత్వం మౌనంగా 

కన్నీటి ధారగా శోకిస్తున్నది

యుద్ధోన్మాదం జడలు విప్పుకొని నర్తిస్తున్నది

ఈ యుద్ధ తాండవంలో

 సామాన్యులే సమిదలు

ఎవరి కోసం యుద్ధం? 

ఎందుకోసం యుద్ధం ?

బాల్యం బూడిదై పోతుంటే 

ఈ ధరిత్రి హర్షిస్తుందా ?

చిరునవ్వులు మాయమైపోతుంటే

రాలిన బాలల నవ్వులు 

తిరిగి విరబూస్తాయా?

వారింట వెలుగులు ప్రసరిస్తాయా?

విద్వేషాలు విత్తిన నేలపై ఎప్పటికీ 

శాంతి పూలు పూయవు !

అక్కడ.. శవాల కమురు వాసనే విహరిస్తుంది

శ్మశాన నిశ్శబ్దమే రాజ్యమేలుతున్నది

మనవాళి మనగడ ప్రశ్నార్థకమతున్నది

చివరకు యుద్ధంలో గెలిచేది 

బలవంతుల పంతాలు మాత్రమే!

ప్రపంచానికిప్పుడు కావాల్సింది.. 

ఓదార్పు కాదు.. శాంతి

మానవత్వం పరిమళించిన 

హృదయాలు ఇప్పుడొక్కటవ్వాలి

ఆ మనసులు మాత్రమే 

విశ్వశాంతికి పాదులు వేస్తాయి

ఆధిపత్యాన్ని కాదు.. అనురాగాన్ని గెలిపిస్తాయి !!