అత్యాధునిక టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి
- 108 కోహెడ వాహనం తనిఖీ
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం లోని అంబులెన్స్ ను సిద్దిపేట జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అత్యాధునిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ.. ఉత్తమమైన సేవను అందించాలని.. మెడికల్ టెక్నీషియన్ రమేష్ ను ఆదేశించారు. ఈ సందర్బంగా రికార్డ్స్ ని పరిశీలించి మెడికల్ ఇంక్యుమెంట్స్, స్టాక్, వర్కింగ్ కండిషన్ ని తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులకి తగిన మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకుంటూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ కేసు రాగానే 30 సెకండ్ల లోపు అంబులెన్స్ ని స్టార్ట్ చేసుకొని బయలుదేరి వారికి ప్రథమ చికిత్స చేస్తూ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరవేయాలని సూచనలు చేశారు. అత్యాధునిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ.. ఉత్తమమైన సర్వీస్ ఇవ్వాలని సూచించారు. డ్యూటీలో ఎటువంటి లోటుపాటలు ఏర్పడిన తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ టెక్నీషియన్ రమేష్, పైలెట్స్ శ్రీనివాస్ పాల్గొన్నారు.






