31 July, 2026 | 8:55 PM

గోదావరి ఉద్ధృతి.. చింతిర్యాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

31-07-2026 07:29 PM

వరద పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ కొరసా అలివేలు, ఉపసర్పంచ్ వెన్న అశోక్ కుమార్

అశ్వాపురం,(విజయక్రాంతి): గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అశ్వాపురం మండలంలోని చింతిర్యాల గోదావరి తీర ప్రాంతాన్ని చింతిర్యాల కాలనీ సర్పంచ్ కొరసా అలివేలు, ఉపసర్పంచ్ వెన్న అశోక్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. గోదావరి నీరు చింతిర్యాల ప్రధాన రహదారికి చేరువ కావడంతో రెండు గ్రామపంచాయతీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ముందుగానే అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, గోదావరి వరదను చూసేందుకు ఎవరూ నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేసిన నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ గుమస్తాలు బొర్ర రమేష్, మహమ్మద్ ముజాహిద్ పాల్గొన్నారు.