31 July, 2026 | 8:55 PM

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రోడ్డుని శుభ్రం చేయించిన అధికారులు

31-07-2026 07:27 PM

బెజ్జూర్,(విజయ క్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు రోడ్డుపై ఉన్న మట్టిని తొలగింప చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.నిన్న కురిసిన భారీ వర్షాలకు బెజ్జూర్ మండలం లోని కుష్నాపల్లి, సుష్మీర్ ఓర్రెలు  పొంగి ఇసుక  మేటలతో రోడ్డు బురదమయమై రాకపోకలకు ఇబ్బంది గా ఉండడం వలన ప్రజలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారనే విషయము  శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దృష్టికి వెళ్లగా  ఆదేషాలు ఇవ్వగా ఎంపీడీవో,సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్  రెండు ఓర్రెల మీద ఉన్న బురద ఇసుక తొలగించడం జరిగినదని తద్వారా  రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయనైనది అని వారు అన్నారు.