31 July, 2026 | 8:55 PM

ఎస్సీ బాలికల హాస్టల్, ఎస్డబ్ల్యూ కార్యాలయం మంథని లో పునః ప్రారంభించాలి

31-07-2026 07:35 PM

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు మంథని ఎస్సీ బాలికల ఎస్ఎంఎస్ హాస్టల్ మరియు ఏఎస్ డబ్ల్యూ ఓ  కార్యాలయాన్ని మంథని లోనే నడిపించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా మంథనిలో ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, మంథనిలోని ఎస్సీ హాస్టల్ లను డీఎస్సీడివో మరియు ఎస్ డబ్ల్యూ వో  మూసి వేస్తున్నారని అన్నారు.

గతంలో పని  చేసిన వార్డెన్  హాస్టల్ ను మూసివేయాలని చూసినప్పటికీ ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా కాపాడుకోవడం జరిగిందని, గత సంవత్సరం నుండి ఇండివిడ్లను వార్డెన్ ను కేటాయించాలని పలుమార్లు కలెక్టర్ గారికి మరియు మంత్రి గారికి తెలియజేయడంతో ఇండివిజువల్  వార్డెన్ కేటాయించడం జరిగింది అప్పటినుంచి ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థిని కూడా చేర్చుకోకుండా విద్యార్థులు వస్తలేరు అని చెప్పుకుంటూ హాస్టల్ను మూసివేసే దిశగా కొత్తగా చార్జ్ తీసుకున్న వార్డెన్ కూడా సాకులు చెప్పడం జరిగింది.

విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్లు వస్తున్న తరుణంలో హాస్టల్ ను ఓపెన్ చేయకుండా పెద్దపల్లి కి తీసుకపోవడంలో మరి వార్డెన్ పై వారికి ఉన్న మక్కువ ఎంతో స్పష్టంగా కనబడుతుందని అన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క అడ్మిషన్ తీసుకోకుండా పిల్లలు వస్తలేరన్న నెపంతో ఇక్కడున్నటువంటి హాస్టలను పెద్దపల్లి కి తరలించడం జరిగింది. ఇది కేవలం విద్యార్థులకు చదువును దూరం చేసే విధంగా డీఎస్సీడీవో మరియు ఎస్ డబ్ల్యూ మరియు వార్డెన్ గుట్టు చప్పుడు కాకుండా హాస్టల్ ను పెద్దపల్లి తరలించడం జరిగింది.

గతంలో కూడా డీఎస్సీడీవో మరియు ఎస్ డబ్ల్యూ ఓ గారు మంథనిలో ఉన్నటువంటి ఏ ఎస్ డబ్ల్యూ కార్యాలయాన్ని తీసుకుపోయి పెద్దపల్లి లో పెట్టడం జరిగింది అంటే మంథని పేద ప్రజలకు ఆఫీస్ పనిలే కాదు హాస్టల్  కూడా లేకుండా చేయడం వారి పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే ఎక్కడ నుంచి తీసుకుపోయిన హాస్టల్ ని మరియు ఏ ఎస్ డబ్ల్యూ కార్యాలన్నీ వెంటనే మంథని లో పునః ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ పాల్గొన్నారు.