మన పల్లెల ప్రగతే నా ఆశయం : ఎంఎల్ఏ జారే
దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ శుక్రవారం దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటించి, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా జగ్గారం గ్రామపంచాయతీ కొడిశల గూడెం, జగ్గారం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. అనంతరం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బోగి సారధికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. శ్రీరాంపురంలో నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మొండివర్రె,
పాత చీపురుగూడెం గ్రామంలో నిర్మిస్తున్న విఒ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాగుపల్లి ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మల్కారం పంచాయతీ, గుత్తావారిగూడెం గ్రామంలో నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.






