31 July, 2026 | 8:55 PM

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బాధాకరం

31-07-2026 07:44 PM

జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య

జవహర్ నగర్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బాధాకరమని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య శుక్రవారం సంతాపం ప్రకటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర మరువలేనిదని బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకొని అండగా నిలిచాడని సుదర్శన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుతూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.