14 July, 2026 | 6:56 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

నులిపురుగుల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

14-07-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల టౌన్, జూలై 13: నులి పురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ తో కలిసి హాజరై విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలను తినిపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం కోసం అందరూ కృషి చేయాలన్నారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మాత్రలను అందిస్తున్నామని, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలందరికీ మాత్రలు అందించడం జరుగుతుందన్నారు.

వైద్య ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖలు, మున్సిపల్, గ్రామపంచాయతీ ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నులి పురుగుల నిర్మూలనతో రక్తహీనత తగ్గి పిల్లల పోషణ మెరుగుపడుతుందని, మానసిక, శారీరక అభివృద్ధి జరిగి అభ్యాసన సామర్థ్యం, పాఠశాలలో హాజరు శాతం పెరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది పిల్లలందరికీ మాత్రలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.