18 July, 2026 | 12:20 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

సమిష్టిగా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి

22-12-2025 11:52 PM

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల,(విజయక్రాంతి): సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర పాలకవర్గ సభ్యులు, అధికారులు  సమన్వయంతో సమిష్టిగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

తన సొంత గ్రామమైన ఉరుమడ్ల గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పాలకవర్గం పనిచేయాలన్నారు. గ్రామాలలో ఉండే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేవలం ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలి తప్పా మిగతా సమయాల్లో రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.