22 May, 2026 | 7:42 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

23-12-2025 12:00 AM

సర్పంచ్ కావటి సుధాకర్

తరిగొప్పుల, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. డిసెం బర్ 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కావటి సుధాకర్, ఉప సర్పంచ్ నీల సంపత్, ఎనిమిది మంది వార్డు మెంబర్లు సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారమహోత్సవం లో గ్రామ కా ర్యదర్శి రవీందర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గా ఎన్నికైన సుధాకర్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు అబ్దుల్ నాగారం గ్రామ ప్రజలకు కృతజ్ఞత లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలొ పంచాయతీ,సిబ్బం ది, ఖాత సందీప్, పరుశరాములు, విజయలక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.