6 June, 2026 | 2:06 AM

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

06-06-2026 12:50 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శుక్రవారం పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మి సైదులు, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్,  ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.