6 June, 2026 | 1:40 AM

ఎలుగుబంటి మృత్యువాత

06-06-2026 12:48 AM

మెదక్ జిల్లా తొనిగండ్ల అటవీ ప్రాంతంలో ఘటన

రామాయంపేట, జూన్ 5: మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మృతి సంచలనంగా మారింది. శుక్రవారం వెలుగు చూసిన ఘటనతో అటవీశాఖ అధికారులు చేరుకొని వెటర్నరీ డాక్టర్ తో పోస్టుమార్టం చేయించారు.

ఎలుగుబంటి కడుపులో మామిడి పీచులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని రామాయంపేట ఫారెస్ట్ రేంజర్ చెప్పారు. గిరిజన ప్రాంతం కావటం వల్ల ప్రజల ప్రాణహాని భయంతో ఏదైనా హాని తల పెట్టారా అన్నదానిపై విచారణ చేపట్టామన్నారు. ఎలుగుబంటి వయస్సు పెరిగిన రీత్యా కూడా చనిపోయి ఉండవచ్చని రేంజర్ అనుమానం వ్యక్తం చేశారు.