16 July, 2026 | 2:10 AM

ప్రకృతిని కాపాడాలి

16-07-2026 12:00 AM

డీఎస్పీ అంజయ్య

వికారాబాద్, జూలై- 15 : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని వికారాబాద్ డిఎస్పి అంజయ్య అన్నారు. బుధవారం వికారాబాద్ లోని శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన హరితో దయ కార్యక్రమంలో సిఐ రఘు కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి, సిఐకి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడుతూ వాతావరణం లో చోటు చేసుకున్న మార్పుల వల్లనే సకాలంలో వర్షాలు రాలేని పరిస్థితి కలిగిందని అన్నారు.

వర్షాలు లేకుంటే మానవ మనుగడ సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో జీవరాశులకు ఎలాంటి ఇబ్బంది రావద్దనుకుంటే చెట్లను బాగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా మొక్కలు నాటి పాఠశాల ఆవరణను మరింత పచ్చగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల AGM వెంకట్,ప్రిన్సిపాల్ లక్ష్మణ్, VP రాజేష్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.