16 July, 2026 | 2:21 AM

నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపిన భాస్కర్ రెడ్డి

16-07-2026 12:00 AM

ఐటీడీఎస్, అల్కాపురి పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వక భేటీ

నాగోల్, జూలై 15 (విజయక్రాంతి): కొత్తపేట రామకృష్ణాపురం డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన ఐటీడీఎస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ (శ్రీ రామకృష్ణాపురం), అల్కాపురి కాలనీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను దేప భాస్కర్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ రామకృష్ణాపురం ఐటీడీఎస్ సొసైటీ అధ్యక్షుడిగా బి. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా రామస్వామి, అల్కాపురి కాలనీ అధ్యక్షుడిగా శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షుడిగా వీరేందర్ ఎన్నికైన సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూన్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, జ్ఞానేశ్వర్ యాదవ్, భగత్, కార్యదర్శి రామారావు, కోశాధికారి నరసింహారావు, సభ్యులు వెంకటరమణ, అన్నపూర్ణమ్మ, సత్యనారాయణ, సైదారావు, కృష్ణయ్య, శేషగిరిరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.