12 July, 2026 | 1:55 AM

సర్ సర్వేను విజయవంతం చేయాలి

12-07-2026 12:51 AM
  1. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  2. బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలతో సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యే

మల్కాజిగిరి, జూలై 11(విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమా న్ని ఎలాంటి అశ్రద్ధకు తావులేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్‌ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారమ్ల పంపిణీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, పేర్ల చే ర్పులు, మార్పులు, చిరునామా మార్పులు, షిఫ్టింగ్ అయిన ఓటర్ల వివరాల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశిం చారు.

ఈ సందర్భంగా ఆనంద్‌బాగ్ డివిజన్‌లోని బీజేఆర్ నగర్, మీర్జాలగూడ డివి జన్, గౌతమ్‌నగర్ డివిజన్‌లోని గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్, నేరేడ్‌మెట్ డివిజన్ లో జీకే హనుమంతరావు నివాసం, యా ప్రాల్ డివిజన్‌లోని డీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అలాగే యాప్రాల్ లోని న్యూ బెరేకా చర్చ్, సాయి కృప కాలనీలో పాస్టర్లతో ప్రత్యేక అవగాహన సమావే శం నిర్వహించి సర్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.సమీక్ష సమావేశాల్లో సర్ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఎ మ్మెల్యే, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బీఎల్‌ఏల నుంచి వివరాలు తెలుసు కున్నారు.

2002 ఓటరు జాబితాలో ఓటు లేని వారి నమోదు విధానం, ఒకే కుటుంబంలో కొంతమంది సభ్యుల పేర్లు మాత్రమే ఉండి మిగిలిన వారి పేర్లు లేకపోతే అనుసరించాల్సిన విధానం, ఈసీఐఎన్‌ఈటీ పోర్ట ల్లో బూత్ నంబర్లు నమోదు చేసినప్పుడు వేరే బూత్ వివరాలు చూపిస్తున్న సాంకేతిక సమస్య, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కొందరికి ఎన్యుమరేషన్ ఫారమ్‌లు అందకపోవడం, వృద్ధులకు ఫారాలు అందక ఓటు హక్కు కోల్పోయే పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, చనిపోయిన వారు లేదా డబుల్ నమోదైన ఓటర్ల పేర్ల తొలగింపుకు ఫారం-7, పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర మార్పులు, సవరణల కోసం ఫారం-8 వినియోగంపై ఎమ్మెల్యే బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, జీకే హనుమంతరావు, ప్రభాకర్ గౌడ్, కేబుల్ రమేష్, కరంచంద్, శోభా, శివ, సాయి గౌడ్, చిందం శ్రీనివాస్, లియోనార్డ్, రమేష్, నిర్ణీత్ రెడ్డి, జంగరాజు, ఉపేందర్, శ్రీనివాస్, విజయ్ రెడ్డి, భిక్షపతి, మల్లేష్ యాదవ్, కిట్టు, శ్రీరాములు యాదవ్, బాచి, లక్ష్మణ్ యాదవ్, బైరు అనిల్, వెంకటేష్ యాదవ్, సందీప్ రెడ్డి, రాజేందర్, కనకరాజ్, నవీన్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.