17 June, 2026 | 2:03 PM

పల్స్ పోలియోను విజయవంతం చేయాలి

16-06-2026 01:18 AM

జిల్లా కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 15: ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో జరిగిన సమావేశంలో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయాలని సూచించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా నివారణకు ఫాగింగ్, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పల్స్ పోలియో, డెంగ్యూ నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.