కార్మికుల సమస్యలపై పోరాడాలి
ఎస్‌డబ్ల్యూ ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం
మంచిర్యాల టౌన్, జూన్ 30: ఆర్టీసీ డిపోలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకే కార్మిక సంఘాలు పనిచేస్తాయని ఎస్ డబ్ల్యూ యూ ఐఎన్టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం అన్నారు.
మంగళవారం జరిగిన మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎస్ డబ్ల్యూ యూ ఐఎన్టియూసీ జనరల్ బాడీ సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహంతో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో గతంలో ఉన్నటువంటి యూనియన్లు వారి స్వార్ధ ప్రయోజనాలకు కార్మికులను అయోమయంలో పెట్టి వారి స్వలాభం కోసం ప్రయత్నించాయని, గత ప్రభుత్వం చేయలేనటువంటి సమస్యలను ఈ ప్రభుత్వంలో చేస్తుందనే నమ్మకంతో ఈ యూనియన్ ముందుకెళ్తుందని అన్నారు.
తమ యూనియన్ ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్య వర్తిత్వంగా ఉండి కార్మిక సమస్యలను పరిష్కరిస్తుందని, మంచిర్యాల డిపోలో కార్మికులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డిపో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో అధ్యక్షులుగా తోట సత్తయ్య, కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, గ్యారేజీ సెక్రటరీగా రామ్మూర్తిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొమురన్న, సంపత్, రాజేందర్, భీమేశ్వర్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






