1 July, 2026 | 2:59 AM

చిన్నారుల జీవితాలను పరిరక్షించాలి

01-07-2026 02:00 AM

ఎస్పీ డాక్టర్ శబరిష్ 

మహబూబాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): చిన్నారులను పనిలో పెట్టుకోవద్దని, చిన్నారుల జీవితాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పిలుపునిచ్చారు. జూలై 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తిం పు, రక్షణే ప్రధాన లక్ష్యగా చేపట్టనున్న ఆపరేషన్ ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హా ల్లో ఎస్పీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పోలీసు శాఖతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, చైల్ వెల్ఫే ర్ కమిటీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రత్యేక బృందాల అధికారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా క్టర్ శబరీష్ ఐపీఎస్ మాట్లాడుతూ, జూలై 1 నుంచి జూలై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ ముస్కాన్ 12‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారుల ను, ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు త దితర ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలలను, భి క్షాటన చేస్తున్న చిన్నారులను, అలాగే తప్పిపోయిన చిన్నారులను త్వరితగతిన గుర్తిం చేందుకు పోలీసు శాఖ ఆధునిక ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో కూడిన ‘దర్పణ్ యాప్’ ను వినియోగిస్తోందని, అలా  గుర్తిం చి రక్షించి వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వద్దకు చేర్చడమే ఈ కార్యక్రమం యొ క్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొనే అన్ని ప్ర భుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో బా ధ్యతాయుతంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బాలలను కార్మికులు గా నియమించుకునే యజమానులపై సం బంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.