షాద్‌నగర్‌లో చారిత్రక ఫిరంగి మాయం
01-07-2026 01:35 AM
మాజీ ఎమ్మెల్యే బక్కని ఆందోళన
షాద్ నగర్, జూన్ 30 (విజయక్రాంతి): షాద్నగర్ మున్సిపల్ కార్యా లయం వెనుక భాగంలో ఉన్న రెండు చారిత్రక ఫిరంగులలో ఒకటి మాయమవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ఒక ఫిరంగి కూడా దుమ్ముకొట్టుకుపోయి ఉండటాన్ని గ మనించిన ఆయన, స్వయంగా దాన్ని శుభ్రం చేసి రంగులు వేయించారు. గత పాలకులు రూ. 2 లక్షల నిధులు మంజూరు చేసి కూడా ఈ చారిత్రక ఆయుధాలను నిర్లక్ష్యం చేయడంపై ఆ యన మండిపడ్డారు. బహిరంగ మా ర్కెట్లో లక్షల రూపాయల విలువైన ఈ ఫిరంగి అదృశ్యంపై పురాతత్వ శా ఖ దృష్టి సారించాలని కోరారు. ఈ విషయమై షాద్నగర్ ఏసీపీకి సమాచారం అందించినట్లు, త్వరలోనే పో లీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నర్సింహులు తెలిపారు. అధికారులు సంరక్షించాలని డిమాండ్ చేశారు.






