1 July, 2026 | 2:23 AM

జంగారెడ్డిపల్లిలో ఇంటింటి సర్ సర్వే

01-07-2026 01:33 AM

ఆమనగల్లు, జూన్ 30(విజయక్రాంతి) రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మున్సిపాలిటీ లోని 4వ వార్డు జంగారెడ్డిపల్లి లో మంగళవారం  బూత్ నెంబర్ 204 పరిధిలో బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా వివరాల పరిశీలన, అర్హులైన ఓటర్ల వివరాల సేకరణ, అవసరమైన మార్పులు చేర్పులపై జంగారెడ్డిపల్లి  ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, వార్డు ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుడ్డు ఆంజనేయులు యాదవ్ బీఎల్‌ఓ సికిందర్  బీఎల్‌ఏలు జంతుక అల్లాజీ,జంతుక రమేష్  తదితరులు పాల్గొన్నారు.