12-02-2026 12:00:00 AM
తాజా మాజీ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ ను ముషీరాబాద్ నియోజకవర్గంలోనే అభివృద్ధిలో ముందుంచామని గాంధీనగర్ డివిజ న్ తాజా మాజీ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ అన్నారు. అధికారికంగా 5 ఏళ్ల కార్పొరేటర్ బాధ్యతలను సంపూర్ణంగా పూర్తి చేసుకున్న ఎ. పావని వినయ్ కుమార్ ను గాంధీనగర్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద బుధవారం బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్ ఆధ్వర్యంలో డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి శాలువాలు, పూల మాలలతో ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, సురేష్ రాజు, ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, సాయి కుమార్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.