3 July, 2026 | 11:57 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం..

28-04-2026 12:46 AM

టి.పి.సి.సి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ  వర్గం లోని  బిబిపేట్  మండలం తుజాల్పూర్  గ్రామంలో ఇందిరమ్మ ఇంటి  నూతన గృహప్రవేశ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ఇంటికి సంబంధించిన వంట సామాగ్రి నీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల  సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారన్నారు.

సొంత స్థలం లేని వారికి ఇంటి నిర్మాణం కోసం త్వరలో ప్రభుత్వము ఒక ప్రకటన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజన్న, జిల్లా ఉ పాధ్యక్షులు, పంపరి లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్, క్రేడా అధ్యక్షులు లక్ష్మి నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు, సలీం, పిడుగు సాయిబాబా,మామిళ్ళ రమేష్, నర్సొల్ల మహేష్, వార్డ్ మెంబర్, కుమార్, యూత్ ప్రెసిడెంట్,ద్రావిడ్, కోటేశ్వర్ రాజశేఖర్, బండారి శ్రీకాంత్, నిరంజన్, రాహుల్ , తదితరులు పాల్గొన్నారు.