3 July, 2026 | 11:09 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విజిలెన్స్ దాడులు

28-04-2026 12:48 AM

రికార్డులు, కీలక పత్రాలు పరిశీలించిన అధికారులు

జనగామ, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): జిల్లా కేంద్రం లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.సీఐ గౌత మ్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రాకేష్, ఎమ్మార్వో లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ప లు కీలక పత్రాలు, కార్యాలయ రికార్డులను పరిశీలించారు.రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి.. ఎలాంటి ఆవకతవకలు జరుగుతున్నాయా అనే దానిపై సమాచారం సేకరించారు. కార్యాలయంలో ఫీజులు, ప త్రాల పరిశీలనలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు.కొన్ని అనుమానస్పద అంశాల పై వివరాలు సేకరించినట్టు సమాచారం. ఈ అక్రమాలపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా పరిగణిస్తామని,దోషిగా ఎవరైనా తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తుంది.