calender_icon.png 10 February, 2026 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను నెరవేరుస్తున్నాం

10-02-2026 01:37:31 AM

  1. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి
  2. త్వరలో ఐటీ పార్కు, ఆటోనగర్ ఏర్పాటు
  3. పెద్దపల్లి, మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి/మంథని, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ర్టంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడు తూ.. పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమ వారం నిర్వహించిన యుద్ధ భేరి సభ, మంథనిలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీధర్‌బా బు మాట్లాడుతూ.. ఎన్నికల ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతోపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గూడులేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు, ఆటో కార్మికుల కోసం ఆటో నగర్ నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేస్తున్నామని ప్రకటించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అ భివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రాష్ర్టంలో సీఎంఆర్‌ఎఫ్ మం జూరులో పెద్దపల్లి అగ్ర స్థానంలో నిలిచిందని, అందుకు స్థానిక ఎమ్మెల్యే విజయ రమ ణారావు కృషి ఫలితమేనన్నారు.

రూ. కోటితో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టడీ కో చింగ్ సెంటర్ భవన నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నా రు. పెద్దపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెం డా ఎగరడం ఖాయమన్నారు. అభివృద్ధి, సం క్షేమాన్ని గుర్తించి పెద్దపల్లి పట్టణ ప్రజ లు అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వి జయరమణారావు మాట్లాడు తూ పెద్దపల్లి పట్టణాభివృద్ధికి రూ.92 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.

మరో రూ.22 కోట్లు మంజూరు చె యించామని గుర్తు చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 మం ది కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించే బాధ్యత ప్రజలదేనని, పట్టణాభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్దావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వెంటనే పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రజలకు సేవ చేసి గుర్తింపు పొందాలని సూచించారు. - ఈ కార్యక్రమంలో పెద్ద పల్లి ఎన్నికల ఇన్‌చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలకు ఓటు వేయడం వృథా

 (విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, అవినీతికి చో టు లేకుండా అవినీతిపరులను ఏరవేస్తానని మంత్రి శ్రీధర్‌బాబు అన్నా రు. ప్రజలు ప్రతిపక్షాలకు ఓటు వే యడం వృథా అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి 13 మంది కాం గ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మంథని పట్టణాన్ని అభివృద్ధి పతంలో నడిపించడానికి మీ సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఇప్పటికే మంథని మున్సిపల్ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, దరఖాస్తుదారులు ఎవరై నా వచ్చిన వెంటనే దరఖాస్తుకు సం బంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి త్వరితగతిన విచారణ చేసి ప నులు చేస్తామని మంత్రి శ్రీధర్ బా బు తెలిపారు.