సరస్వతీ తీరంలో భక్తి తరంగాలు
- అంత్య పుష్కరాల్లో ఆధ్యాత్మిక మహోత్సవం
- పుష్కర స్నానం ఆచరించిన దత్తగిరి పిఠాధిపతి
కాళేశ్వరం/ మహబూబాబాద్, మే 27 (విజయక్రాంతి): సరస్వతి అంత్య పుష్కరాల ఏడవ రోజు భక్తి, భావోద్వేగం, ఆధ్యాత్మికత కలిసిన మహోత్సవంగా మారింది. పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తజన సందో హంతో ఘాట్లు నిండిపోగా, కాళేశ్వరం తీర్థక్షేత్ర ప్రాంతమంతా భక్తిరస ప్రవాహంగా కని పించింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పితృ దేవతలకు తర్పణాలు సమర్పించారు.
మహిళలు దీపాలతో హారతులు ఇస్తూ సరస్వతి నది మాటకు ప్రార్థనలు చేయగా, భజన బృందాల కీర్తనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేశాయి. పుష్కర ఘాట్ల వద్ద, ఆలయంలోని క్యూలైన్ లలో దేవాదాయ శాఖ, సేవా సంస్థలు భక్తుల కు తాగునీరు, మజ్జి గ, ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు క లగకుండా దేవాదాయ శాఖ, పోలీసులు, రెవె న్యూ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
సాయంత్రం వేళ నదీతీరంలో నిర్వహించిన మహా హారతి భక్తుల ను విశేషంగా ఆకట్టుకుంది. దీపాల కాంతులతో మెరిసిపోయిన పుష్కర ఘాట్లు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడగా, సరస్వతి అంత్య పుష్కరాల ఏడవ రో జు భక్తుల హృ దయాల్లో చిరస్మర ణీయ అనుభూతిగా నిలిచింది. కాశీ పండితులు సరస్వతి అంత్యపుష్కరాల్లో నిర్వ హించిన నవరత్న హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాళేశ్వరం సరస్వతి అంత్యపుష్కరాల్లో బుధవా రం భర్తీ పూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పిఠాధిపతి వైరాగ్య చికామణి గిరి మహారాజ్ పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సరస్వతీ నదికి ప్రత్యేక పుష్కర పూజలు, హారతి నిర్వహించారు. ఆ తర్వాత ముక్తేశ్వర స్వామిని, శుభనందా దేవి, సరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. గత వారం రోజు లుగా విపరీతమైన ఎండల నేపథ్యంలో కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతి అంత్యపుష్క రాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున వాన జల్లు లు కురిసాయి. దీనితో వాతావరణం కాస్త చల్లబడింది. ఫలితంగా బుధవారం తెల్లవారుజామున బ్రహ్మ గడియల్లో పుష్కర స్నా నం ఆచరించడానికి భక్తులు తరలివ చ్చారు. పుష్కర స్నానాల అనంతరం ముక్తేశ్వర స్వామి, శుభానందా దేవి, సరస్వతి ఆలయాల్లో దర్శనానికి భక్తులు బారులు తీరారు.






