పాతాళానికి జలాలు!
శేరిలింగంపల్లి పరిధిలో..
- ముదురుతున్న నీటి ఎద్దడి
ట్యాంకర్ల కోసం ప్రజల పడిగాపులు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : నగరంలో అప్పుడే వేసవి వేడి మొదలైంది. ఏప్రిల్ నెల ముగియక ముందే నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం తక్కువగా ఉండటం, వాతావరణంలో మార్పుల వల్ల భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది.
ఫలితంగా నగరంలోని మెజారిటీ బోర్లు అడుగంటిపోయాయి.దీంతో సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరూ ఇప్పుడు వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రికార్డు స్థాయికి నీటి డిమాండ్..
జలమండలి గణాంకాల ప్రకారం, మార్చి చివరి నాటికి నగరంలో రోజువారీ ట్యాంకర్ల డిమాండ్ 8,500 కి చేరింది. నెల రోజుల క్రితం ఈ సంఖ్య కేవలం 5 వేల లోపు ఉండగా, కేవలం 30 రోజుల్లోనే డిమాండ్ రెట్టింపు కావడం గమనార్హం. ఏప్రిల్, మే నెలల్లో ఈ డిమాండ్ రోజుకు 10 వేల ట్యాంకర్లకు పైగా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు జలమండలి ప్రస్తుతం 1,100 ట్యాంకర్లను వినియోగిస్తోంది. నగరవ్యాప్తంగా ఉన్న 140 ఫిల్లింగ్ పాయింట్ల వద్ద ట్యాంకర్లు నిరంతరాయంగా నిండుతున్నా, వినియోగదారులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.
ఐటీ కారిడార్లో తీవ్ర ఇబ్బందులు..
హైదరాబాద్లోని వెస్ట్ జోన్ ప్రాంతాలైన కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నానకరంగుడా, వంటి ఐటీ కారిడార్లలో నీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ ప్రాం తాల్లోని అపార్ట్మెంట్లు, విల్లాలు పూర్తిగా బోర్లపైనే ఆధారపడతాయి.
ఇప్పుడు 50 శాతా నికి పైగా బోర్లు ఎండిపోవడంతో, ఐటీ ఉద్యోగులు నీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకోవడానికి గంటల తరబడి యాప్లలో వేచి చూస్తున్నారు. అలాగే అమీర్పేట, నిజాంపేట, కుత్బుల్లాపూర్, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రైవేటు ట్యాంకర్ల యాజమానుల నీరు దోపిడీ..
జలమండలి ట్యాంకర్లు బుక్ చేసిన తర్వాత రావడానికి 2 నుండి 3 రోజుల సమ యం పడుతుండటంతో, ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు నిర్వాహకులు ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. సాధారణంగా రూ. 800 నుండి రూ. 1000 ఉండే ట్యాంకర్ ధర, ఇప్పుడు డిమాండ్ను బట్టి రూ. 1,500 నుండి రూ. 2,000 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ ధరలపై అదనంగా రూ. 200 నుండి 300 వరకు వసూ లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
హాస్టళ్లు, అపార్ట్మెంట్ల వాసుల అవస్థలు..
నగరంలోని వేలాది హాస్టళ్లలో విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండ టంతో నీటి వినియోగం అధికంగా ఉంటుం ది. బోర్లలో నీరు లేకపోవడంతో రోజుకు 2 నుండి 3 ట్యాంకర్లు తెప్పించాల్సి వస్తోందని హాస్టల్ యజమానులు చెబుతున్నా రు. ఇది వారిపై అదనపు ఆర్థిక భా రంగా మారుతోంది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని జలమండలి అధికారులు సరఫరా వేళలను పెం చుతున్నారు.
అయితే, ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని, మొక్కలకు నీరు పోయడం లేదా వాహనా లను కడగడం వంటి పనులకు మం చినీటిని వాడకూడదని వర్ష పు నీటి సంరక్షణ గుంతలను పునరుద్ధరించు కోవాలని, భవిష్యత్తులో భూగర్భ జలమట్టం పెరగడా నికి ఇది ఎంతో అవసరమని అధికారులు సూచిస్తున్నారు.




