లీడింగ్ లీడర్ కావలెను!
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య కొరవడిన సమన్వయం
జిల్లాలో ఎవరికి వారే.. నాయకులు తీరు
పట్టించుకోని పార్టీ అధిష్టానం
రాజకీయ భవిష్యత్తుపై ద్వీతీయ శ్రేణి నాయకుల ఆందోళన
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి రెండున్నర ఏళ్ళు పూర్తి అవుతున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చేసే లీడర్ కరువయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం కోరవడి పార్టీకి నష్టం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే.. అనే చందంగా మారింది. దీంతో పార్టీ కార్యకర్తలకు నేతలకు కష్టమొస్తే ఎవరికీ చెప్పుకోవాలో.. ఎవరి ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నారు.
గ్రూపుల మధ్య ఉన్న క్రింది స్థాయి లీడర్లు ఒక గ్రూపుకు చెప్తే మరో గ్రూపు వారు తమను టార్గెట్ చేస్తున్నారని సీనియర్ కార్యకర్తలు అధిష్టానం ముందు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. పార్టీలో గుర్తింపు దక్కుతుందని ఆశపడ్డ కాంగ్రెస్ లీడర్లకు నేడు నిరాశ మిగులుతుంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా నేతలకు తెలియందేం కాదు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉమ్మడి జిల్లాలను శాసించిన నేతలకు సైతం కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.
నిర్మల్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీకి నాలుగు, బీఆర్‌ఎస్‌కు రెండు, కాంగ్రెస్ 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తూర్పు జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంటే, పశ్చిమ జిల్లాలో బిజెపి బలం గా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ముఖ్య నేతలు ప్రాధాన్యతను పెంచవలసిన పార్టీ అధిష్టానం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయి లో దృష్టి సారించకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఉమ్మడి జిల్లాను సమన్వయం చేసే బాధ్య త ఎవరికి లేకపోవడంతో ఇప్పుడు ఆ లీడర్ ఎవరని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్లో సమన్వయం దెబ్బతినడం కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా పోయాయన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సీతక్కఆ తర్వాత టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కొనసాగిస్తున్నారు.
తూర్పు జిల్లా నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఉన్న ప్పటికీ ఆయన ఒక జిల్లాకు మాత్రమే పరిమితమవుతున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పార్టీ నియమించినప్పటికీ ఆయన మంచిర్యాల జిల్లాకు మాత్రమే పరిమితమవుతున్నారు. గిరిజన కోపరేటివ్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ కూడా ఆ ప్రాంతానికి పరిమితమయ్యారు.
ఇక పశ్చిమ జిల్లాకు వస్తే నిర్మల్ ,ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ముధోల్, అసెం బ్లీ స్థానాలు ఉండగా ఎంపీ సీటు బిజెపి ప్రాథమికవేస్తునగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బుజ్జి పటేల్ వ్యవరిస్తున్నారు. పశ్చిమ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్ ముధోల్‌లో కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం కొరబడింది. పాత కొత్త నేతలు ఒకటే పార్టీలో ఉన్న పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహిస్తున్నారు.
నాలుగు జిల్లాలకు నలుగురిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించి జంబో జట్టు జిల్లా కార్యవర్గం ప్రకటించి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ కమిటీలు పూర్తయిన ఇప్పటికీ ఒక్క జిల్లాలో కూడా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో పార్టీ నేతలు కార్యకర్తలు నిరాశాన్ని చెందుతున్నారు. జిల్లా కమిటీలో పదవు ల కోసం ఆయా నియోజకవర్గాల్లో పెద్ద నేతలు పట్టుబట్టి వారి వారి అనుచరులకు పదవులను ఇప్పించుకున్నారు.
పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఇతర కారణాలతో పదవులు పొందడం సహజమే అయినప్పటికీ పశ్చిమ జిల్లాలో మాత్రం ఉన్న పదవులు ఇతర పార్టీలకు దక్కడం ఇక్కడ నేతల మధ్య సమన్వయం లోపం ప్రధాన కారణమని పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నా రు. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలు, సమన్వయం చేసేందుకు ఎవరికి బాధ్య త లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత తగ్గి ప్రతిపక్ష బిజెపి బలపడుతుందన్న వాదనలు వినవస్తున్నాయి.
లీడర్లు ఉన్న.. పదవులు లేవు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు ఉన్న పార్టీ పదవులు లేకపోవడమే సమన్వయ లోపానికి ప్రధాన కారణం. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు పశ్చిమ జిల్లా లో ఉన్నారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇం ద్రకరణ్ రెడ్డి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విట్టల్ రెడ్డి రేఖా శ్యాం నాయక్, నారాయణరావు పటేల్ వంటి నేతలు ఉన్నా రు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసే సీనియర్ నేతలైన శ్రీరామ్, నరేష్ జాదవ్, ఆడే గజేందర్, సుజాత, తూర్పు జిల్లాలో సుగుణ, మాజీ మంత్రి జి వినోద్, వంటి నేతలు ఉన్నప్పటికీ వీరికి పార్టీలో సముచితమైన స్థానం కల్పించకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.
పక్క జిల్లాలకు రాష్ట్రస్థాయిలో పదవులు వచ్చి ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఏ ఒక్కరికి రాష్ట్ర స్థాయి పదవులు కార్పొరేషన్ పదవులు నామినేటెడ్ పదవులు దక్కలేదు. దీంతో వారు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఆశతో ఎదురుచూస్తున్న పార్టీ అధిష్టానం మాత్రం మొండి చేయి చూపుతోంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని పదేపదే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటిస్తున్న పదవిలో విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నారని పార్టీ నేతలే చెప్తున్నారు.
అయితే డిసిసి అధ్యక్షులుగా ఎన్నికైన వెడ్మ బొజ్జు పటేల్, నరేష్ జాదవ్, పార్టీ స్టీరింగ్ నడిపేందుకు ప్రయత్నిస్తున్న సీనియర్ నేతలు ఉండడంతో అది ముందుకు వెళ్లడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామా. నేత లు వచ్చినప్పుడు ఉంటున్నామా. తర్వాత వెళ్ళిపోతున్నామా. తమ కింది లీడర్లకు న్యాయం చేస్తున్నామా. అని రీతిలో పెద్దలు వివరిస్తున్నారు. దీనికి తోడు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ ప్రతిపక్షాల పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు సీఎం గౌరవిస్తున్నారని ఇక తమ పరిస్థితి ఏం కావాలని కొందరు నేతలు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సమస్య అధిష్టానం దృష్టికి..
ఉమ్మడి జిల్లాలో పార్టీకి జరుగుతున్న నష్టంపై జిల్లా సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలి ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ శ్రావణ్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జిల సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మె ల్యేలు సీనియర్ నేతలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిస్థితిపై తమ గోడును వెళ్ళకక్కుకున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నియో జకవర్గ ఇన్చార్జిలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల్లో కనీసం తమకు భాగస్వామ్యం కూడా దక్కకుండా పోతుందని పథకాలు ప్రభుత్వాన్ని అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాటిని ప్రారంభించి ఫోటో కాల్ కూడా పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్టీ ఎప్పుడు బాగుపడుతుందో.. ఎప్పుడు మాకు పదవులు వస్తాయో అని నిరాశతో గురవుతున్నారు. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఉమ్మడి జిల్లాలో లీడింగ్ చేసే లీడర్ కు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.




