హైస్కూల్‌కు వాటర్ ప్లాంట్ విరాళం
17-08-2026 12:09 AM
తాడ్వాయి,ఆగష్టు,16( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల ఉన్నత పాఠశాలకు ఆదివారం గ్రామానికి చెందిన ఘనిష్యం అనసూయ వాటర్ ప్లాంట్ ను విరాళంగా అందించారు.ఆమె భర్త స్వర్గీయ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు అయిన ఘనిష్యం విఠల్ రావు జ్ఞాపకార్థం ఈ వాటర్ ప్లాంట్ ను పాఠశాలకు విరాళం అందించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, నాయకులు కిషన్ రావు, కృష్ణమూర్తి, రవీందర్ రావు, రామచందర్ రావు,శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.






