calender_icon.png 21 February, 2026 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీ వాగులోకి నీరు

21-02-2026 12:00:00 AM

తూప్రాన్, ఫిబ్రవరి 21: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని హల్దీవాగులోని నీళ్లు అడుగంటి పోవడంతో హల్ది వాగు ఇరువైపులు ఉన్న వ్యవసాయ పొలాలకు నీరు లేక ఇబ్బందులు ఎదురు కావడానికి గమనించిన యావపూర్ గ్రామ సర్పంచ్ యాంజాల స్వామి, కిష్టాపూర్ సర్పంచ్ చుక్క హిమబిందు శ్రీశైలం ప్రత్యేక చొరవతో మాజీ ఎమ్మెల్యే తుంకుంట నరసారెడ్డిని కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి వ్యవసాయ పొలాలకు నీళ్ళు వదలాలని కోరడంతో సమయం కాకపోయినా వీరి కోరిక మేరకు అవుసులోని పల్లె వర్గల్ మండలం వద్ద ఉన్న రిజర్వాయర్ గేట్లు ఎత్తి హల్ది వాగులోకి నీరు వదలడం జరిగింది.

ఈ సందర్భంగా రిజర్వాయర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించి పూలు వదలారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు జింక మల్లేష్, యావపూర్ వార్డు సభ్యులు లింగోడ్ల మహేష్, రామస్వామి, బిక్షపతి, కిష్టాపూర్ వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.