18వ వార్డులో నీటి సమస్యకు చెక్
వేసవికి ముందస్తు చర్యలు చేపట్టిన వార్డు సభ్యులు మంగలి కళ్యాణి,
చైర్మన్ సమతా వెంకట్ రెడ్డి
చేవెళ్ళ, మార్చి 3 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో మంచి నీటి సమస్యకు చెక్ పడింది. నీటి సమస్య వార్డు ప్రజలు కౌన్సిలర్ దృష్టికి తీసుకురావడంతో మంగళవారం 18వ వార్డు కౌన్సిలర్ మంగలి కల్యాణియాదగిరి మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారు శైలజాఆగిరెడ్డితో కలిసి అంగడి బజారు కాలనీలో. వేసవికాలం సమిపిస్తుండడంతో మున్సిపల్ లో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ చెప్పారు. అవసరమున్న చోట కొత్త బోర్లు వేసి పాత బోర్లకు ఫ్లెషింగ్ చేయిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల సొసైటీ మాజీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, గుడిమల్కాపూర్ మాజీ డైరెక్టర్ మంగలి యాదగిరి, వార్డు ప్రజలు ఉన్నారు




